Friday, January 7, 2011

అప్పలరాజు కోసం పాట పాడిన బ్రహ్మానందం

అప్పలరాజు బ్రహ్మానందం

హాస్యనటుడు సునీల్ ప్రధానపాత్రలో శ్రేయ ప్రొడక్షన్స్ పతాకంపై రాంగోపాల్ వర్మ దర్శకత్వంలో కిరణ్‌కుమార్ కోనేరు నిర్మిస్తున్న చిత్రం ‘కథ,స్క్రీన్‌ప్లే,దర్శకత్వం- అప్పలరాజు’. ప్రస్తుతం ఈచిత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. సినిమాకు సంబంధించిన పాటలు ఇప్పటికే మూడు పాటలు విడుదలయ్యాయి. చిత్రంలోని నాలుగో పాట ‘నా పేరు శ్రీశైలం- నే చేస్తా రౌడీయిజం’ అనే గీతాన్ని బ్రహ్మానందం పాడారు. ఈపాటను మధుర ఎంటర్‌టైన్‌మెంట్స్ ద్వారా రేడియో మిర్చిలో విడుదల చేసారు.

ఈసందర్భంగా దర్శకుడు రాంగోపాల్ వర్మ మాట్లాడుతూ- దాదాపు 24 ఏళ్లుగా పరిశ్రమలో ఉంటూ 840 చిత్రాల్లో నటించిన బ్రహ్మానందం తొలిసారిగా ఓ వెరైటీ పాట పాడారు. బ్రహ్మానందం సినిమాలపై ఉన్న మోజుతో రౌడీయిజాన్ని వదిలేస్తాడు. అప్పలరాజుకు తగిలే షాకుల్లో ఓ షాకు బ్రహ్మానందం. తన గన్ను పక్కన పెట్టి పెన్ను తీసుకుని తనపై తానే ఓపాట రాసుకుంటాడు. ఆ పాటే ఇది. రొటీన్‌గా వచ్చే చిత్రాలకు భిన్నంగా ఉంటుందీ చిత్రం. ఓ రకంగా నేను పరిశ్రమకు వచ్చిన కొత్తల్లో ఎదుర్కొన్న అనుభవాలన్నీ కలిపి కథగా అల్లుకున్నాను అని తెలిపారు. అలీ, తనికెళ్ల భరణి, యమ్మెస్ నారాయణ, ధర్మవరపు, రఘుబాబు, వేణుమాధవ్, కృష్ణుడు, కోట శ్రీనివాసరావు, స్వాతి, గులాటి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: కోటి, నిర్మాత: కిరణ్‌కుమార్ కోనేరు, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: రాంగోపాల్ వర్మ.

0 comments:

Post a Comment